మరింత కాలం సోనియానే కొనసాగే అవకాశం?

మరింత కాలం సోనియానే కొనసాగే అవకాశం?
X

పార్టీకి శాశ్వత అధ్యక్షుడు లేకుండానే ఏడాది కాలంగా కాంగ్రెస్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. గత ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఉన్నా.. ఎన్నికల్లో ఘోర పరాభావం తరవాత.. ఓటమికి బాధ్యత వహిస్తూ.. పార్టీ పగ్గాలను రాహుల్ వదులుకున్నారు. తరువాత కొంత కాలం పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. తరువాత తాత్కాలికంగా సోనియా పార్టీ పగ్గాలు చేపట్టారు. అయితే, ఇలాగే ఒక ఏడాది కాలం ముగిసింది. దీంతో సీడబ్ల్యూసీ భేటీలో తాత్కాలిక అద్యక్షురాలిగా మరింత కాలం కొనసాగాలని కోరే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. శాశ్వత అధ్యక్షడు పార్టీకి లేడు కనుక.. పార్టీ రాజ్యాంగం ప్రకారం తాత్కాలిక అధ్యక్ష పదవీకాలం పొడిగించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో మరో ఏడాది కూడా సోనియానే అధ్యక్ష పదవిలో కొనసాగ మని కోరే అవకాశం ఉందని అంటున్నారు.

Tags

Next Story