ధోనికి రిటైర్మెంట్ ఆలోచన లేదు: మహి మేనేజర్

ధోనికి రిటైర్మెంట్ ఆలోచన లేదు: మహి మేనేజర్

భారత్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్ పై ధోని మేనేజర్ మిహిర్ దివాకర్ తాజాగా స్పందించారు. రిటైర్మెంట్ ఆలోనలు ధోనికి ఇప్పట్లో లేవని అన్నారు. ధోని ఏడాది కాలంగా కికెట్ కు దూరంగా ఉన్నారు. గత ఏడాది ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్ ఆడిన తరువాత కుటుంబంతో ఎక్కువ సమయం ఉంటున్నారు. అయితే, ఈ ఏడాది ఐపీఎల్ ఆడి.. అందులో సత్తా చూపిన తరువాత మళ్లీ భారత్ జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ధోని ఉన్నారు. అయితే, ఈ కరోనా వలన ఐపీఎల్ నిర్వాహణలో జాప్యం ఏర్పడింది. ఈ ఏడాది అసలు నిర్వహిస్తారో? లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే, బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ బుధవారం మాట్లాడుతూ.. ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లోనూ ఐపీఎల్ నిర్వహిస్తామని అన్నారు. ఇప్పుడు దివాకర్ మాట్లాడుతూ.. ధోనిని చాలా దగ్గరగా చూసానని.. ఆయన ఫిజికల్ గా చాలా ఫిట్ గా ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో కూడా తన ఫిట్‌నెస్ కాపాడుకుంటున్నారని దివాకర్ తెలిపారు. గంగూలీతో పాటు, దివాకర్ ప్రకటనతో.. ధోని అభిమానుల్లో కాస్తా ఉత్సాహం కనిపిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story