ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం

ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం
X

ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రైవేటు ఆసుపత్రులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. పీపీఈ కిట్లను బహిరంగ ప్రదేశాల్లో పడేసి వెళ్లిపోయారు. ఓ ప్రైవేటు అసుంబులెన్స్ లో వచ్చిన ఓ వ్యక్తి రోడ్డుపక్కన పడేశాడు. వైద్యసిబ్బంది తీరుతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ కిట్ కరోనా రోగులకు ఉపయోగించారేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత సురక్షితంగా డిస్పోజ్ చెయ్యాల్సిన కిట్లను ఇలా నిర్లక్ష్యంగా పడేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Next Story