తెలంగాణలో కొత్తగా 1924 కరోనా కేసులు
By - TV5 Telugu |8 July 2020 11:47 PM GMT
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1924 కేసులు నమోదు కాగా.. 11 మంది మరణించారు. ఇక కొత్తగా 992 మంది కోలుకున్నారని బులిటెన్ విడుదల చేసింది ఆరోగ్య శాఖ. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 29536 కి చేరింది. ఇందులో 17 వేల 279 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇక ప్రస్తుతం 11 వేల 933 యాక్టీవ్ కేసులున్నాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 324 మంది కరోనాతో చనిపోయారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com