ఇళ్ల స్థలాల ముసుగులో భారీ దోపిడీ : సిపిఎం

X
పేదలకు విజయవాడ నగరంలోనే ఇళ్లస్థలాలు కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎమ్ బాబురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిస్ని ల్యాండ్ వద్ద జరిగిన ధర్నాలో సిపిఎం నేతలు, పేదలు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాల ముసుగులో భారీ దోపిడీకి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బాబురావు మండిపడ్డారు. డిస్ని ల్యాండ్ లో 57 ఎకరాల స్థలం ఉంటే ఎక్కడో దూరాన ఇవ్వడం సరికాదన్నారు. ఇప్పటికే బిల్డ్ ఏపీ పేరుతో స్థలాలు అమ్మేసి.. దూర ప్రాంతాలలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం వరుసగా వాయిదా వేయడం ఏంటని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
