హోటల్‌లో భోజనం చేస్తే 50 శాతం డిస్కౌంట్.. సర్కారు బంపర్ ఆఫర్

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. ఈ వైరస్ ప్రభావంతో అన్నిరకాల వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. అయితే పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పుడిప్పుడే తెరుచుకున్నాయి. కానీ కరోనా భయంతో కస్టమర్లు రాకపోవటంతో.. హోటల్ యజమానులు అల్లాడిపోతున్నాయి.
బ్రిటన్‌లో ఈ సమస్య మరింత ఎక్కువుగా ఉంది. దీంతో బ్రిటన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ లోని హోటళ్లు, రెస్టారెంట్లలో భోజనం చేస్తే.. 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ అంటూ బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఆతిథ్య పరిశ్రమపై మహమ్మారి భారాన్ని తగ్గించడంలో సహాయపడేందుకు విస్తృత ప్యాకేజీలో భాగంగా ఆగస్టు నెలంతా హోటల్, రెస్టారెంట్ భోజనంపై యూకే భోజనప్రియులకు 50 శాతం తగ్గింపు లభిస్తుందని బ్రిటన్ ఛాన్సలర్ పేర్కొన్నారు.
ఈ 50 శాతం డిస్కౌంట్ పథకం సోమవారం నుంచి బుధవారం వరకు ఆహారం, మద్యపానరహిత పానీయాలను అనుమతిస్తున్నట్టు ప్రకటించారు. ఇదే సమయంలో కరోనా వైరస్ పూర్తిగా అంతం కానందున హోటళ్లు, బార్లకు వచ్చేవారు విధిగా భౌతిక దూరం పాటించాలని, ముఖాలకు మాస్కులు ధరించాలని బ్రిటన్ ప్రభుత్వం సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com