జులై 15న ఏపీ కేబినెట్‌ భేటీ

జులై 15న ఏపీ కేబినెట్‌ భేటీ
X

ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. వచ్చే బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరిగే కేబినెట్‌ భేటీలో సంక్షేమ పథకాలు, కోవిడ్‌ నియంత్రణ చర్యలపై చర్చించనున్నట్టు సమాచారం. ఇక గత నెల 11న జరిగిన‌ భేటీలో ఇళ్లపట్టాలు, గృహనిర్మాణాల మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులకు, వైఎస్సార్‌ చేయూత, జగనన్న తోడు, గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నం ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీల్లో 282 టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టుల ఏర్పాటుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. అలాగే వీటితోపాటు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను కేబినెట్ ఆమోదించింది.

Tags

Next Story