అంతర్జాతీయం

నేపాల్‌లో భారత న్యూస్‌ చానళ్ల నిలిపివేత

నేపాల్‌లో భారత న్యూస్‌ చానళ్ల నిలిపివేత
X

ప్రపంచానికి తమ దేశంలో ఏమి జరుగుతుందనేది తెలియకుండా నిజాలను సమాధి చెయ్యాలని నేపాల్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. గత కొన్నిరోజులుగా నేపాల్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని ప్రసారం చేసినందుకు భారత్ పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది నేపాల్.

నేపాల్‌లోని కేబుల్ ఆపరేటర్లు దూరదర్శన్ మినహా భారతీయ వార్తా ఛానెళ్లను నిలిపివేశారు. నేపాలీ పౌరుల సార్వభౌమత్వాన్ని మరియు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వార్తలను ప్రచారం చేస్తోందని కెపి శర్మ ఒలి ప్రభుత్వం ఆరోపించింది.

భారతీయ మీడియా వ్యాప్తి చేస్తున్న తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి దౌత్య మార్గాలను సమీకరిస్తామని పేర్కొంది. నేపాల్ ప్రధాని కెపి శర్మ ఒలిపై భారత మీడియా నిరాధారమైన వార్తలు ప్రచారం చేస్తోందని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ ప్రతినిధి నారాయణ్ కాజీ శ్రేష్ట ఆరోపించారు. అలాగే, నేపాల్ ప్రధాన సలహాదారు పిఎం బిష్ణు రిమల్ కెపి శర్మ ఒలికి సంబంధించి భారతదేశం మీడియా నుండి వచ్చిన వార్తలను ఖండించారు.

Next Story

RELATED STORIES