రూ.4 వేలకే కరోనా ఇంజెక్షన్!

X
By - TV5 Telugu |10 July 2020 5:13 PM IST
కరోనా చికిత్సలో వినియోగించే యాంటీ వైరల్ ఔషధం రెమ్‌డిసివిర్‌కు జనరిక్ సిప్రెమికి లైన్‌క్లియర్ అయింది. అత్యవసర చికిత్సలో సిప్రెమి వినియోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. దీంతో దేశీయంగా ఈ ఔషధాన్ని విడుదల చేయనున్నట్టు సిప్లా ప్రకటించింది.
100 ఎంజీ ఇంజెక్షన్‌ను రూ.4వేలకే విక్రయించనున్నట్టు కంపెనీ తెలిపింది. మొదటి 80వేల డోసులను సరఫరా చేస్తామని, ఇది ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మాత్రమే లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు కంపెనీ తన వంతు సాయంగా కొంత ఔషధాన్ని విరాళంగా అందించనున్నట్టు తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com