బ్రేకింగ్.. ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబే హతం

బ్రేకింగ్.. ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబే హతం
X

గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. గురువారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో వికాస్‌ దూబేను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కాన్పూర్‌కు తరలిస్తుండగా కాన్వాయ్‌లోని ఓ కారు బోల్తా పడింది. ఇదే సమయంలో వికాస్‌ దూబే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు జరిపిన కాల్పు ల్లో గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబే మృతిచెందాడు.

Tags

Next Story