కొవిడ్ రోగులకు కొత్త చికిత్స.. అందుబాటులోకి వస్తే ఆస్పత్రికి వెళ్లాల్సిన పన్లేదు..

కొవిడ్ రోగులకు కొత్త చికిత్స.. అందుబాటులోకి వస్తే ఆస్పత్రికి వెళ్లాల్సిన పన్లేదు..
X

కొవిడ్ మహమ్మారినుంచి బయటపడే మార్గం కోసం నిరంతరాయంగా ప్రయోగాలు సాగిస్తున్నారు పరిశోధకులు. ప్రస్తుతం కరోనా రోగులకు అత్యవసర చికిత్సలో అందించే రెమిడెసివిర్ ను సరికొత్త రూపంలో అందించేందుకు గిలిద్ సైన్సెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటి వరకు ఈ మందును ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్నారు. తాజా పరిశోధనలు ఈ ఔషధాన్ని ఇన్‌హీలర్‌ రూపంలో వినియోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని కోసం 18-45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 60 మందిని ఎంపిక చేసినట్లు పేర్కొంది. ఈ ప్రయోగం విజయవంతమైతే రోగులు ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ విధానంలో రోగికి ఔషధాన్ని ఇవ్వడం వలన ఇన్ఫెక్షన్ సోకిన భాగంలోనే తొలుత నయం చేసే అవకాశం ఉంటుందని కంపెనీ భావిస్తోంది.

Tags

Next Story