వరద బీభత్సం.. నీటిలో కొట్టుకుపోయిన ఇళ్లు

X
నేపాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలతో పలుప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. దేశ వ్యాప్తంగా వరదులు బీభత్సం సృష్టిస్తుండటంతో.. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సింధిపాల్చోక్ ఏరియాలోని లోతట్టు ప్రాంతంలో ఉన్న పలు ఇళ్లు వరదనీటిలో కొట్టుకుపోయాయి.
మరికొన్ని భవనాల కింద నేల కొట్టుకుపోవడంతో ఎప్పుడు కూలిపోతాయో అన్నట్టుగా పరిస్థితి ఏర్పడింది. దీంతో స్థానిక అధికార యంత్రాంగం అప్రమత్తమై ఆ కాలువ వెంబడిగల ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
