ఔరంగాబాద్‌లో 9 రోజులపాటు జనతా కర్ఫ్యూ

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇక మహారాష్ట్రలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల తీవ్రత పెరుగుతోంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధనలను అమలు చేస్తున్నారు. మరోవైపు ఔరంగాబాద్ నగరంలోని ప్రజలు శుక్రవారం నుంచి ‘జనతా కర్ఫ్యూ’ను పాటిస్తున్నారు. శుక్రవారం నుంచి 9 రోజుల పాటు జనతా కర్ఫ్యూని పాటించనున్నారు.
‘జనతా కర్ఫ్యూ’నేపథ్యంలో జనాలు బయటకు రాకుండా.. ఇళ్లకే పరిమితమయ్యారు. షాపులను యజమానులు స్వచ్చందంగా మూసివేశారు. దీంతో నగరంలో ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. కాగా, ప్రజల సహకారంపై పోలీస్ కమిషనర్ హర్షం వ్యక్తం చేశారు. 9 రోజుల జనతా కర్ఫ్యూ వల్ల ఔరంగాబాద్‌లో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com