కరోనా కేసులు పెరుగుతుండటంతో యోగి సర్కార్ కీలక నిర్ణయం

కరోనా కేసులు తీవ్రమవుతున్న కారణంతో ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో లాక్ డౌన్ శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్ ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులను వెల్లడించారు. ఈ మూడు రోజుల లాక్ డౌన్ కాలంలో కేవలం అత్యవసర సేవలు మాత్రమే పనిచేస్తాయని పేర్కొంది. మూడు రోజులపాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నింటిలో ఎలాంటి కార్యకలాపాలు జరగవని అన్ని కార్యాలయాలను మూసివేయాలని ఆదేశించారు. వలసకూలీలు, ఇతర అవసరాల రీత్యా రైళ్లు, విమానయాన సర్వీసులు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని ప్రధాన కార్యదర్శి.
అంతేకాకుండా రహదారి నిర్మాణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని కర్మాగారాలలో పనులకు అనుమతినిస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే వీరిలో 20వేల మంది పైగా కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ కూడా ఒకటిగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com