కరోనా సోకి విదేశాంగ మంత్రి మరణించినట్లు రూమర్లు

కరోనా సోకి విదేశాంగ మంత్రి మరణించినట్లు రూమర్లు
X

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. వేలాది కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగా నమోదవుతోంది. గతకొన్నిరోజులుగా పాకిస్థాన్ లో కరోనా మహమ్మారి విజృంభణ కోనసాగుతోంది. ఈ తరుణంలో పాకిస్తాన్‌లో గురువారం కరోనా బారిన పడిన ఆ దేశ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి మరణించినట్లు రూమర్లు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి.

అయితే దీనిపై అర్థరాత్రి సమయంలో మంత్రి ఖురేషి స్వయంగా వివరణ ఇచ్చారు. తన మరణ వార్త అబద్ధమని పేర్కొన్నారు. తాను బాగున్నానని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నానని.. తాను మరణించినట్టుగా కథనాలు పుట్టించడం మానుకోవాలని సూచించారు.

Tags

Next Story