ప్ర‌భాస్ 20వ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌.. టైటిల్‌ కూడా ఫిక్స్

ప్ర‌భాస్ 20వ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌.. టైటిల్‌ కూడా ఫిక్స్

యంగ్ రెబ‌ల్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ప్ర‌భాస్ 20వ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌ అయింది. 'సాహో' మూవీ త‌ర్వాత ప్ర‌భాస్ నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ఉంది. 1960 దశకం నాటి లవ్‌స్టోరితో ఎంతో ప్రతిష్టాత్మకంగా గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాస్ ప్యూర్ రొమాంటిక్ పాత్రలో కనిపించనున్నారట.

ప్రభాస్‌కి జోడిగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ మూవీకి 'రాధేశ్యామ్' అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. అలానే ప్ర‌భాస్ లుక్ కూడా రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఇందులో ప్రభాస్‌ లుక్ ప్రేక్ష‌కుల‌కి మంచి కిక్ ఇస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story