గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే భార్య, కొడుకు అరెస్ట్

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను మధ్యప్రదేశ్ ఉజ్జెయినీ మహంకాళి మందిర్‌లో గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. జులై 2న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లోని బిక్రూ గ్రామంలో వికాస్ దూబే గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో డీసీపీ సహా 8 మంది పోలీసులు మృతి చెందారు. ఈ ఘటనలో దూబే భార్య, కుమారుడి పాత్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే వికాస్ దూబే భార్య, కొడుకును యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. లక్నోలోని కృష్ణానగర్ నుంచి దూబే భార్యను, కుమారుడిని, ఇద్దరు పనివాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దూబే భార్య రిచా దూబే సమాజ్‌వాదీ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. అంతేకాదు ఆమె జిల్లా పరిషత్ సభ్యురాలిగా కూడా ఉన్నారు.
మరోవైపు గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను మధ్యప్రదేశ్ పోలీసులు ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అప్పగించారు. దూబేకు ట్రాన్సిట్ రిమాండ్ విధించగానే ప్రత్యేక వాహనంలో అతడిని కాన్పూర్‌కు తరలిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

