ఐటీ రంగంపై కొవిడ్ దెబ్బ.. 30,000 మంది ఉద్యోగులు..

ఐటీ రంగంపై కొవిడ్ దెబ్బ.. 30,000 మంది ఉద్యోగులు..
X

కరోనా సంక్షోభం ఐటీ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపి ఉంటుందని ఆర్ధిక వేత్తలు అంచనా వేస్తున్నారు. దాదాపు 30 వేల మంది ఉద్యోగాలు కోల్పోయి ఉంటారని అంచనా. మరో 50 వేల మంది వేతనం లేని సెలవుల్లో ఉన్నారని పరిశ్రమవర్గాల వివరణ. చిన్న,మధ్య స్థాయి, బీపీఓ కంపెనీలపై కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందని నిపుణులు అంటున్నారు. భారత్ లోని ఐటీ, బీపీఓ కంపెనీల్లో 43.6 లక్షల మంది పని చేస్తున్నారు. అందులో 0.70 శాతం మేర ఉద్యోగాలకు కోత పడింది. కొత్త ప్రాజెక్టులు రావట్లేదు. ఆదాయం తగ్గింది, మార్జిన్లపై ఒత్తిడి పెరిగింది.

దీంతో ఖర్చులు తగ్గించుకోవాలనుకుంటున్నాయి కొన్ని కంపెనీలు. జులై- సెప్టెంబరు త్రైమాసికంలో ఉద్వాసనలు ఊపందుకోవచ్చని ప్రముఖ ఐటీ కంపెనీకి చెందిన హెచ్ ఆర్ విభాగ అధిపతి హెచ్చరించారు. చాలా కంపెనీలు బెంచ్ పై నున్న వారిని, పనితీరు సరిగా లేని వారిని సెలవుపై ఇంటికి పంపుతున్నారు. గడిచిన కొన్నేళ్లలో ఐటీ రంగం సిబ్బందిని తగ్గించుకుంటూ వస్తోంది. ఇప్పుడు కరోనా రూపంలో మరో కొత్త సంక్షోభం తలెత్తింది. దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించకపోయినా, పని తీరు సరిగా లేని ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురానుంది. అలాంటి వారికి ఉద్వాసన పలకాలనుకుంటోంది. ఐటీ ఉద్యోగుల్లో వేతనాలు కూడా భారీ స్థాయిల్లో ఉంటాయి. కరోనా కాలంలో రాబడి అవకాశాలు తగ్గుతుండడంతో చాలా కంపెనీలు సీనియర్, మిడ్ లెవెల్ మేనేజ్ మెంట్ జీతాల్లో కోతలు పెడుతున్నాయి.

Tags

Next Story