జైళ్లలో కరోనా కలకలం.. 8000 మంది ఖైదీలు విడుదల

జైళ్లలో కరోనా కలకలం.. 8000 మంది ఖైదీలు విడుదల
X

అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇక కాలిఫోర్నియాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. కరోనా నేపథ్యంలో కాలిఫోర్నియా జైలులో శిక్ష అనుభవిస్తున్న సుమారు 8,000 మందిని ఆగస్టు చివరి నాటికి ప్రభుత్వం గవిన్ న్యూసోమ్ విడుదల చేయనుంది. శుక్రవారం ఈ మేరకు ప్రకటన చేశారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈ పని చేయనున్నట్లు అక్కడి జైల్‌ అధికారులు తెలియజేశారు.

కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ది కరెక్షన్స్ అండ్ రిహాబిలిటేషన్ ప్రకారం.. రాష్ట్ర జైళ్లలో 2,286 కరోనా పాజిటివ్‌ కేసులున్నాయి. ఇక శుక్రవారం ఉదయం 31 మంది మరణించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మొదటి విడుతలో 180 రోజులు, అంతకన్నా తక్కువ శిక్ష అనుభవిస్తున్న వారిని రిలీజ్ చేశారు. ఈ నెలాఖరులోగా 4,800 మంది ఖైదీలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆరోగ్య నిపుణులు, ఖైదీల న్యాయవాదులు ఈ ప్రకటనకు హర్షం వ్యక్తం చేశారు.

Tags

Next Story