దేశ రాజధాని ఢిల్లీలో 2089 కొత్త కరోనా కేసులు , 42 మరణాలు

X
By - TV5 Telugu |11 July 2020 4:57 AM IST
దేశ రాజధాని ఢిల్లీలో 2089 కొత్త కరోనా కేసులు , 42 మరణాలు నమోదయ్యాయి. 2089 కొత్త కేసులతో, ఢిల్లీలో ధృవీకరించబడిన కోవిడ్ -19 కేసుల సంఖ్య ఇప్పుడు 1,09,140 గా ఉంది. గత 24 గంటల్లో, మరో 42 కరోనావైరస్ సంబంధిత మరణాలను, మరో 2468 రికవరీలను నమోదు చేసిందని ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు జూలై 10 నాటికి ఢిల్లీలో కోవిడ్ -19 ద్వారా మొత్తం 84,694 మంది రోగులు కోలుకోగా, 3300 మంది మరణించారు. ఇప్పుడు ఢిల్లీలో 21,146 క్రియాశీల కేసులు ఉన్నాయి. అదే సమయంలో, దేశ రాజధానిలో ప్రస్తుతం 12,272 మంది రోగులు ఇంటి నిర్బంధంలో ఉన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

