అంతర్జాతీయం

ఫుట్‌బాల్‌ లెజెండ్‌ కన్నుమూత

ఫుట్‌బాల్‌ లెజెండ్‌ కన్నుమూత
X

లెజెండరీ ఫుట్‌బాల్‌ ఆటగాడు.. ఇంగ్లాండ్ 1966 ప్రపంచ కప్ విజేత జాక్‌ చార్లటన్‌ కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. చార్లటన్ అనారోగ్యంతో సుదీర్ఘ పోరాటం తరువాత శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ వార్తను ధృవీకరిస్తూ చార్లటన్ కుటుంబం శనివారం ఉదయం ఒక ప్రకటనను విడుదల చేసింది, అందులో "జూలై 10, శుక్రవారం 85వ ఏట జాక్ మరణించాడు." అని పేర్కొంది.

కాగా ఆయన కొంతకాలంగా కుటుంబంతో పాటు. నార్తమ్‌బెర్లాండ్‌లోని ఇంట్లో ఉన్నాడు. జాక్‌ లీడ్స్ యునైటెడ్‌కు 21 సంవత్సరాల పాటు 773 ఆటలను ఆడారు. అనంతరం రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ మేనేజర్‌గా దశాబ్దం పాటు సేవలందించారు. ప్రపంచంలోని ఫుట్‌ బాల్‌​ క్లబ్‌లు, ఆటగాళ్లు ఆయన మృతికి నివాళులు అర్పించారు.

Next Story

RELATED STORIES