తిరువనంతపురంలో వారంపాటు లాక్‌డౌన్‌ పొడిగింపు

తిరువనంతపురంలో వారంపాటు లాక్‌డౌన్‌ పొడిగింపు
X

కేరళలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తిరువనంతపురంలో లాక్‌డౌన్‌ను మరోవారంపాటు పొడిస్తున్నట్లు సీఎం పినరయ్‌ విజయన్‌ శుక్రవారం తెలిపారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో త్రిపుల్‌ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మరోవైపు తిరువనంతపురంలోని పొంతూరులో పాజిటీవ్ కేసులు పెరగడంతో 25 మంది కమాండోలను మోహరించింది. కాగా, కేరళ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,950కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి 27 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags

Next Story