యూపీలో 50గంటల కఠిన లాక్‌డౌన్

దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్‌లో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. కరోనా కట్డడి చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలో 50గంటల కఠిన లాక్‌డౌన్ విధిస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది.
రాత్రి 10గంటల నుంచి లాక్‌డౌన్ అమలులోకి రావడంతో శనివారం ఉదయం చాలా నగరాలు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. నిత్యావసర దుకాణాలు మినహా ఇతర షాపులన్నీ మూతపడ్డాయి. నగరాల్లోని చాలా ప్రాంతాలను పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
కాగా యూపీలో ఇప్పటి వరకు 32,362 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుండి 21,127 మంది కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా మహమ్మారి బారిన పడి 862 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com