11 July 2020 10:56 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / భారీ వర్షాలు.. 22 మంది...

భారీ వర్షాలు.. 22 మంది మృతి

భారీ వర్షాలు.. 22 మంది మృతి
X

నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలు చోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల వల్ల నారాయణితో పాటు పలు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు లక్షలాది మందిని నిరాశ్రయులను చేసాయి.

ఈ వరదల కారణంగా 22 మంది ప్రాణలు కోల్పోయారు. నేపాల్ దేశంలోని కస్కీ జిల్లాలో కురిసిన భారీవర్షాల వల్ల ముగ్గురు పిల్లలతోసహా ఏడుగురు మృతి చెందారు. పోఖారా జిల్లా సారంగకాట్ ప్రాంతంలో వర్షాలకు ఇల్లు కూలిపోయి ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరో 10 మంది గాయపడటంతో వారిని హాస్పిటల్‌కి తరలించి చికిత్స చేస్తున్నారు. లాంజంగ్ జిల్లాలో ముగ్గురు, రుకుం జిల్లా అత్ బిస్కట్ ప్రాంతంలో ఇద్దరు మరణించారు. జాజర్ కోట్ జిల్లాలో 12 మంది గల్లంతయ్యారు.

Next Story