రేణూ దేశాయ్ 'పెళ్లిగోల'

రేణూ దేశాయ్ పెళ్లిగోల

ఇదేదో కొత్త సినిమా టైటిల్ అని అందులో రేణూ దేశాయ్ నటిస్తోందేమో అని అనుకుంటున్నారేమో. అదేంకాదు.. ఈమధ్య ఎవరితో మాట్లాడినా, ఎక్కడికి వెళ్లినా తన పెళ్లి ప్రస్తావనే తెస్తున్నారని రేణూదేశాయ్ వాపోతున్నారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన రేణుకు మళ్లీ అవే ప్రశ్నలు ఎదురైనా వాటిని అంతగా పట్టించుకోలేదు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రేణుకు మళ్లీ అవే ప్రశ్నలు ఎదురయ్యయి. వాటికి రేణు స్పందిస్తూ.. అందరూ నా పెళ్లి గురించే అడుగుతున్నారు. వాళ్లకి నేను పెళ్లి చేసుకున్నా ఇబ్బందే.. చేసుకోకపోయినా ఇబ్బందే.. పెళ్లికి సంబంధించిన ప్రశ్నలతో విసిగిపోయాను. ఈ సందేహాలన్నింటికీ సమాధానంగా ఓ సినిమా చేస్తాను. దానికి 'పెళ్లిగోల' అనే టైటిల్ పెడతాను అని రేణూ సరదాగా సమాధానం చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story