వారెన్‌ బఫెట్‌కు షాకిచ్చిన అంబానీ

వారెన్‌ బఫెట్‌కు షాకిచ్చిన అంబానీ
X

బెర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్ సీఈఓ వారెన్ బఫెట్ కు ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముకేశ్‌ అంబానీ షాక్ ఇచ్చారు. వారెన్ బఫ్ఫెట్‌ను రిలయన్స్ ముఖేష్ అంబానీ అధిగమించారు. బ్లూమ్‌బెర్గ్ బిలినారెస్ సూచికలో వెల్లడైన వివరాల ప్రకారం.. వారెన్ బఫ్ఫెట్ నికర విలువ. 67.9 బిలియన్లు కాగా. అంబానీ నికర విలువ 68.3 బిలియన్ డాలర్లుగా ఉంది.

దీంతో ముఖేష్ అంబానీ ఇప్పుడు ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల జాబితాలో 8వ స్థానంలో నిలవగా .. బఫ్ఫెట్ 9 వ స్థానానికి చేరుకున్నారు. రిలయన్స్‌ టెలికాం విభాగం జియోలో వరుస పెట్టుబడులతో అంబానీ సంపద గణనీయంగా పుంజుకుంది. మార్చి 23 న బిఎస్ఇలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ఈక్విటీ షేరు ధర రూ .864. ఉండగా ప్రస్తుతం ఈ స్టాక్ రూ .1,820 కు పెరిగింది. దీంతో ముఖేష్ అంబానీ నికర విలువ గణనీయంగా పెరిగింది.

Tags

Next Story