బిగ్ బీ మనవరాలికీ కరోనా పాజిటివ్..

బిగ్ బీ మనవరాలికీ కరోనా పాజిటివ్..

బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుటుంబంలో వరుసగా కరోనా భారిన పడుతున్నారు. శనివారం అమితాబ్ బచ్చన్ ఆయన కుమారుడికి పాజిటివ్ అని రాగా.. ఆదివారం బిగ్ బి కోడలు, మనవరాలికి కూడా కరోనా సోకింది. నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆమె కుమార్తె ఆరాధ్యకు కూడా కరోనావైరస్ నిర్ధారణ అయినట్టు పలు ఆంగ్ల వెబ్ సైట్లు వార్తలు రాశాయి. శనివారం వీరికి ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా నెగటివ్ అని వచ్చింది, అయితే ఆదివారం RTPCR టెస్ట్ లలో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని పేర్కొన్నాయి. మిగిలిన కుటుంబ సభ్యులు.. జయ బచ్చన్, శ్వేతా బచ్చన్ నందా , ఆమె పిల్లలు అగస్త్య , నవ్య నవేలి కి కరోనా నెగటివ్ రిపోర్ట్స్ వచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story