బిగ్‌బీ అమితాబ్‌కు కరోనా

బిగ్‌బీ అమితాబ్‌కు కరోనా

దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడం లేదు. సామన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇక బాలీవుడ్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌‌కు కరోనా వైరస్‌ సోకింది. ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో వారికి చికిత్స అందిస్తున్నారు.

తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అమితాబ్ ట్వీట్ చేశారు. మరో వైపు ఈ విషయంపై అభిషేక్ కూడా ఓ ట్వీట్ చేశారు.

‘నాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. నా కుటుంబసభ్యులు, ఉద్యోగులకు కూడా టెస్టులు నిర్వహించారు. ఫలితాలు తెలియాల్సి ఉంది. పదిరోజులుగా నాతో మెలిగినవారు కరోనా పరీక్షలు చేయించుకోండి’ అని శనివారం రాత్రి అమితాబ్‌ ట్వీట్‌ చేశారు.

‘శనివారం ఉదయం నాకు, నాన్నకు కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించారు. ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. కరోనా లక్షణాలు ఉన్నందున హాస్పిటల్‌లో చేరాము. ఎవరూ ఆందోళన పడకండి’ అని అభిషేక్‌ ట్వీట్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story