కరోనా బారిన పడ్డ సినీ నటుడి తల్లి

కరోనా బారిన పడ్డ సినీ నటుడి తల్లి

తన తల్లి దులారి కరోనా మహమ్మారి బారిన పడ్డారని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఆదివారం ట్విట్టర్‌లో తెలియజేశారు. అలాగే తన సోదరుడు రాజు ఖేర్, బావ రిమా, మేనకోడలు బృందా కూడా

కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ అయినట్టు చెప్పారు. ఈ విషయాన్నీ ఆయన ఒక వీడియో రూపంలో వెల్లడించారు. అందులో ఇలా పేర్కొన్నారు. 'నా తల్లి, సోదరుడు, బావ, మేనకోడలు కరోనావైరస్ బారిన పడ్డారు. వారి ఆరోగ్యం స్థిరంగానే ఉంది. వారికి 'తేలికపాటి కోవిడ్ పాజిటివ్' మాత్రమే ఉంది' అని అన్నారు.

అయితే తనకు కరోనా పరీక్షలు చేయగా నెగటివ్ వచ్చినట్టు తెలియజేశారు. కాగా అనుపమ్ ఖేర్ తల్లిని ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్పించగా, మిగిలిన వారు ఇంటి వద్ద నిర్బంధంలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా శనివారం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దాంతో ఈ ఇద్దరు ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story