75మంది తబ్లిగీ జామాత్ విదేశీయలకు బెయిల్

75మంది తబ్లిగీ జామాత్ విదేశీయలకు బెయిల్
X

కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఢిల్లీలోని తబ్లిగి జమాత్ సమావేశాలకు హాజరైన 75 మంది విదేశీయులకు ఢిల్లీ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. వీసా నిబందనలు ఉల్లంఘించి తబ్లిగి కార్యక్రమానికి హాజరై.. కరోనా వ్యాప్తికి కారణమైయ్యారనే ఆరోపణలతో సుమారు 36 దేశాలకు చెందిన 956 మందిపై 59 చార్జిషీట్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. కరోనా నిబంధనలు ఫాలో అవ్వకుండా చట్టవ్యతిరేకంగా మిషనరీ కార్యకలాపాలు నిర్వహించారనే ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. అయితే, శనివారం థాయ్‌లాండ్, నేపాల్ కు చెందిన తబ్లిగీ సభ్యులకు 10 వేల రూపాయల వ్యక్తిగత బాండ్ పై బెయిల్ మంజూరు చేశారు. ఇప్పటి వరకూ 33 దేశాలకు చెందిన 445 మందికి బెయిల్ మంజూరు చేశారు.

Tags

Next Story