కరోనా : మరో సీనియర్‌ అధికారి మృతి

కరోనా : మరో సీనియర్‌ అధికారి మృతి
X

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడికోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు గవర్నమెంటు అధికారులు. ఈ క్రమంలో దురదృష్టవశాత్తు వారిలో కొందరికి కరోనా సోకింది. తాజాగా బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ లోమరో సీనియర్‌ అధికారి ఒకరు కరోనా కాటుకు బలయ్యారు. ముంబయిలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ (బాంద్రా ఈస్ట్‌) అశోక్ ఖైర్నర్ (57) కరోనాతో పోరాడి ఓడారు. దీంతో ఆయన ఇంట పెను విషాదం చోటుచేసుకుంది.

కొద్దిరోజులుగా ఖైర్నర్ కు ఆరోగ్యం బాగాలేదు, అయితే ఆయనకు కోవిడ్ -19 పరీక్షలు చేశారు. ఈ క్రమంలో వైరస్ పాజిటివ్ అని తేలింది. దాంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మొదట బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రిలో, తరువాత సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో, శుక్రవారం ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం మరణించారు. కరోనా పై పోరులో ఉండగా ఆయనకు వ్యాధి సోకినట్లు బీఎంసీకి చెందిన ఒక అధికారి తెలిపారు.

Tags

Next Story