అమితాబ్ బ‌చ్చ‌న్‌ కోలుకోవాల‌ని సినీ ప్ర‌ముఖుల ట్వీట్స్‌

అమితాబ్ బ‌చ్చ‌న్‌ కోలుకోవాల‌ని సినీ ప్ర‌ముఖుల ట్వీట్స్‌

దేశంలో కరోనా వేగంగా వ్యాప్తిచెందుతోంది. పలువురు సినీ ప్రముఖులు ఈ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ఆయ‌న ముంబైలోని నానావ‌తి హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. తనకు కరోనా సోకిందనే విషయాన్ని స్వయంగా బిగ్‌బీ ట్విట్ట‌ర్‌లో ఫోస్ట్ చేశారు. దీంతో ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్నారు.

బాలీవుడ్‌తో స‌హా ఇత‌ర చిత్ర ప‌రిశ్ర‌మ‌ల సినీ ప్ర‌ముఖులు బిగ్‌బీ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటూ ట్వీట్స్ వేశారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, నాగార్జున‌, మ‌హేశ్‌, ర‌వితేజ‌, సందీప్ కిష‌న్‌, గుణ‌శేఖ‌ర్‌, రాశీఖ‌న్నా, తాప్సీ, ప్రియ‌మ‌ణి, శ‌ర‌త్ కుమార్‌, రాధిక‌, నిత్యామీన‌న్ త‌దిత‌రులు అమితాబ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నామ‌ని తెలిపారు. మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు నుంచి మోహ‌న్‌లాల్‌, మ‌మ్ముట్టి తదితరులు అమితాబ్ త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ట్వీట్స్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story