అంతర్జాతీయం

కరోనా కారణంగా మరణశిక్ష వాయిదా

కరోనా కారణంగా మరణశిక్ష వాయిదా
X

కరోనా కారణంగా ఓ మరణశిక్ష అమలు వాయిదా పడింది. కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో నేరస్థుడికి శిక్ష అమలుచేసే కార్యక్రమానికి రాలేకపోతున్నామని బాధిత కుటుంబం కర్టులో అప్పీల్ చేసింది. దీంతో శిక్ష వాయిదా పడింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

ఓక్లహామాలోని యుకాన్‌లో డేనియల్‌ లీ అనే వ్యక్తి .. ఆయుధ డీలర్‌ అయిన విలియం ముయెల్లర్‌ ఆయన భార్య నాన్సీ, వారి 8 ఏళ్ల కూతురు సారా పావెల్‌ను 1996లో దారుణంగా చంపేశాడు. దీంతో అతడికి కోర్టు మరణశిక్ష విధించింది. కొద్దిరోజుల క్రితం జిల్లా కోర్టు ఇంజెక్షన్‌ ద్వారా నేరస్థుడికి శిక్ష అమలుచేయాలని ఆదేశించింది.

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో శిక్ష అమలుచేసే కార్యక్రమాన్ని చూడలేకపోతున్నామని బాధిత కుటుంబం ఫెడరల్‌ కోర్టులో అప్పీల్‌ చేసింది. దీంతో ఏడో సర్క్యూట్‌ అప్పీల్‌ న్యాయస్థానం శిక్షను వాయిదా వేసింది.

Next Story

RELATED STORIES