వ్యాధి వచ్చిన తరువాత ఎందుకు.. ముందు నుంచే ఇలా చేస్తే రోగనిరోధక శక్తి..

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు వైద్య నిపుణులు అందించే ఆరోగ్య సూత్రాలు పాటిస్తే వైరస్ దరిచేరదు.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దైనందిన జీవితంలో వ్యాయామం, యోగా భాగం చేసుకోవాలి. ఓ అరగంట శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. గోరు వెచ్చని నువ్వుల నూనె రెండు నాసికా రంధ్రాల్లో రెండేసి చుక్కల చొప్పున వేసి వెల్లకిల పదినిమిషాలు పడుకోవాలి. గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయాలి. రాత్రి పడుకునే ముందు మరిగించిన పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగాలి.
ఇంట్లో నిత్యం వేపాకులు, సాంబ్రాణి పొగ వేస్తుండాలి. ఇలా చేయడం వల్ల గాలి ద్వారా వచ్చే వైరస్ ని నిరోధించవచ్చు. జీర్ణ శక్తిని పెంచే ఆవాలు, జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లిని వంటల్లో ఎక్కువగా ఉపయోగించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. అలాగే కఫ దోషాన్ని పెంచే పెరుగు, కూల్ డ్రింక్స్, స్వీట్లు వంటివి తినకపోవడమే మంచిది. వేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తినాలి. రాత్రి ఎనిమిది గంటలలోపే భోజనం అన్ని విధాల శ్రేయస్కరం. తిన్న ఆహారం జీర్ణమైన తరువాత నిద్రించే అలవాటు చేసుకోవాలి.
సాయింత్రం పూట కప్పు నీటిలో చిటికెడు మిరియాల పొడి, లవంగ, దాల్చిన చెక్క పొడి, తులసి ఆకులు వేసి మరిగించి దించాలి. అందులో బెల్లం లేదా తేనె వేసుకుని వేడిగా తాగాలి. ఇది రోజుకు రెండు సార్లు తాగొచ్చు. మరీ ఎక్కువ సార్లు తాగితే కడుపులో మంట వస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com