జూలై 14 నుంచి 23 వరకూ లాక్‌డౌన్

జూలై 14 నుంచి 23 వరకూ లాక్‌డౌన్
X

కర్నాటకలో కరోనా రోజురోజుకు విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. అయినప్పటకీ.. కేసుల సంఖ్య తగ్గడంలేదు. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా జూలై 14 నుంచి 23 వరకూ బెంగళూరు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అమల్లో ఉంటుందని సీఎం కార్యాలయం ప్రకటించింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు జూలై 14న రాత్రి 8 గంటల నుంచి జూలై 23 ఉదయం 5 గంటల వరకు బెంగళూరు పట్టణ, గ్రామీణ జిల్లాల్లో పూర్తిగా లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. నిత్యావసర సేవలకు మినహాయింపు ఉంటుందని సీఎంవో పేర్కొంది.

Tags

Next Story