తెలంగాణలో భారీ వర్షాలు

X
By - TV5 Telugu |12 July 2020 3:00 PM IST
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో ఆది, సోమ వారల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని..వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయని.. దీంతో తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా అక్కడక్కడ తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకూ ఉత్తర-దక్షిణ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com