దక్షిణాది రాష్ట్రాల డీజీపీల కీలక సమావేశం

X
By - TV5 Telugu |12 July 2020 4:55 AM IST
శనివారం దక్షిణాది రాష్ట్రాల డీజీపీల కీలక సమావేశం జరిగింది. కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన డీజీపీలు లోకనాధ్ బెహ్రా, జేకే త్రిపాఠి, ప్రవీణ్ సుద్ హాజరయ్యారు. అలాగే ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి పోలీస్ శాఖలోని వివిధ విభాగాల అధిపతులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం, కోవిడ్ నియంత్రణలో రాష్ట్రాల మధ్య సమన్వయం, తీరప్రాంత గస్తీ, మనుషుల అక్రమ రవాణాలపై చర్చ జరిగినట్టు సమాచారం.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com