చిట్ట చివరి రైతు దాకా సాయం అందలి : కేసీఆర్‌

చిట్ట చివరి రైతు దాకా సాయం అందలి : కేసీఆర్‌

రైతుబంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా రైతుబంధు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు సాయానికి టైమ్ లిమిట్ అంటూ ఏమి లేదని.. చివరి రైతు వరకూ సాయం అందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రైతులు ఏ మూలనున్నా వెంటనే వారిని గుర్తించి వారందరికీ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ అధికారులు సూచనల మేరకే రైతులు నియంత్రిత పద్ధతిలో వానాకాలం పంట సాగు చేసుకోవడం శుభపరిణామమని అన్నారు. కరోనా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినప్పటికీ రైతులకు అండగా నిలవాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం రైతుబంధు సాయం విడుదల చేసిందని. ఇప్పటి వరకు 99.9 శాతం మంది రైతులకు సాయం అందిందని ముఖ్యమంత్రి అన్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని సాయం అందని రైతులను గుర్తించి సాయం అందేలా పనిచేయాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story