బాబోయ్.. అమెరికానా నేను వెళ్లను.. ఇక్కడే ఉంటా: యూఎస్ పౌరుడు

బాబోయ్.. అమెరికానా నేను వెళ్లను.. ఇక్కడే ఉంటా: యూఎస్ పౌరుడు
X

ఇక్కడ ఉన్న వాళ్లకి అక్కడికి వెళ్లాలని ఎంత కోరిగ్గా ఉండేది ఒకప్పుడు. ఆ భూతల స్వర్గాన్ని ఒక్కసారైనా చూడాలని మనసు ఉవ్విళ్లూరేది. చదువో, ఉద్యోగమో మరొకటో.. కనీసం కొన్ని రోజులైనా ఉంటే కాస్తైనా సంపాదించుకోవచ్చని కలలు కనేవారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. అమెరికా పేరు చెబితేనే భయపడే పరిస్థితి వస్తుంది. అమెరికా నుంచి వచ్చిన 74 యూఎస్ పౌరుడు సైతం తిరిగి వెళ్లడానికి ఇష్టపడట్లేదు. జానీ పాల్ పియర్స్ గత ఐదు నెలల నుంచి కేరళలోని కొచిలో ఉంటున్నారు. టూరిస్ట్ వీసా మీద వచ్చిన ఆయన ఆగస్ట్ 24తో గడువు ముగుస్తుంది. ఈ లోపు అమెరికా వెళ్లిపోవాలి. కానీ తాను వెళ్లను ఇక్కడే ఉంటాను అని కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తన టూరిస్ట్ వీసాను బిజినెస్ వీసాగా మార్చమని అడుగుతున్నారు. భారత్ కొవిడ్ ని నియంత్రించేందుకు సమర్థవంతమైన చర్యలు అవలంభించిందని అన్నారు.

ఇక కేరళ అయితే వచ్చే ఏడాది వరకు కొవిడ్ రూల్స్ కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ప్రజలను ఆదేశించింది. అదే అమెరికాలో అయితే కరోనాని కట్టడి చేసే చర్యలు సరిగా లేవని, అక్కడ ఇంకా మరణాల రేటు అత్యధికంగా ఉందని అన్నారు. పాజిటివ్ కేసులు కూడా రోజు రోజుకి ఎక్కువవుతున్నాయని అన్నారు. అందుకే నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అని చెప్పారు. కేరళలో మరో 180 రోజులు ఉండి ఇక్కడ ఒక ట్రావెల్ కంపెనీని ఏర్పాటు చేయాలనుకుంటున్నానని తెలిపారు. పర్యాటక వీసాలలో ఉన్న విదేశీయులను దేశంలో 180 రోజులు మాత్రమే ఉండడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. కాగా, కేరళ రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కొవిడ్ మరణాలు 25. వైరస్ బారిన పడిన వారి సంఖ్య 7,438.

Tags

Next Story