తెలంగాణలో 1269 కొత్త కరోనా వైరస్ కేసులు

తెలంగాణలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య మరోసారి గణనీయంగా పెరిగింది. అయితే మొదటిసారి పాజిటివ్ కేసులకంటే ఎక్కువగా డిశ్చార్జ్ లు నమోదయ్యాయి. తెలంగాణలో ఆదివారం 1269 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్ పరిధినుంచే 800 కేసులొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 34,671 కి చేరింది. అలాగే కొత్తగా 8 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కొత్తగా 1563 మంది డిశ్చార్జ్ అయ్యారు. దాంతో కరోనా నుండి కోలుకున్నవారి సంఖ్య 22, 482 కు చేరింది. ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 11,883 గా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story