బ్రేకింగ్.. ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాకు కరోనా

X
ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఆయనతో పాటు ఆయన భార్య, కుమార్తెకు కరోనా సోకింది. కడప జిల్లాలో నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో వారు శుక్రవారం రాత్రి తిరుపతిలోని స్విమ్స్‌కు చేరుకున్నారు. అక్కడ ఆ ముగ్గురికీ ప్రత్యేక గదిని కేటాయించి వైద్యం అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్విమ్స్ డైరెక్టర్ భూమా వెంగమ్మ వెల్లడించారు. అయితే ఆదివారం సాయంత్రం వారు హైదరాబాద్‌లోని హాస్పిటల్‌కి వెళ్లినట్లు డాక్టర్లు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
