గాంధీ హాస్పిటల్లో అయిదు నిమిషాల్లో వైరస్ ని క్లీన్ చేసే రోబో..

గాంధీ హాస్పిటల్లో అయిదు నిమిషాల్లో వైరస్ ని క్లీన్ చేసే రోబో..

హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న రీవాక్స్ ఫార్మా.. కొవిడ్ రోగులకు నిరంతరాయంగా సేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రికి బ్యాక్టీరియా, వైరస్ లను తొలగించే రోబోను అందజేసింది. అటానమస్ రోబో యూవీరోవా బీఆర్.. కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్సనందిస్తున్న ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వద్ద ఏర్పాటు చేశారు. పేషెంట్ కు బెడ్ ను ఏర్పాటు చేయడానికి ముందు చుట్టూ ఉన్న వైరస్ ను ఈ యూవీరోబో పూర్తిగా డిస్ ఇన్ఫెక్ట్ చేస్తుందని ఫార్మా కంపెనీ తెలిపింది. కేవలం అయిదు నిమిషాల్లో అత్యంత వేగంగా ఐసీయూ బెడ్, చికిత్సనందించే గదులు, పీపీఈ కిట్లు, మాస్కులతో పాటు అన్నింటినీ వైరస్ రహితంగా చేస్తుంది. శనివారం తెలంగాణ ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ కు రీవాక్స్ ఫార్మా చైర్మన్ మోహన్ తాయల్ ఈ యూవీరోబోను అందజేశారు. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రికి అధునాతన టెక్నాలజీతో కూడిన పరికరాలను అందజేయడం సంతోషంగా ఉందని కేటీఆర్ ఫార్మా చైర్మన్ ను ప్రశంసించారు.

Tags

Read MoreRead Less
Next Story