ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత

ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
X

సికింద్రబాద్‌లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. అమ్మవారి బోనాల్లో భాగంగా సోమవారం రంగం కార్యక్రమం నిర్వహించారు. జోగిణి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పవని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరు చేసుకున్న దానికి వాళ్లు అనుభవించక తప్పదు అని అన్నారు.

ఈ ఏడాది ఉత్సవాలు తనకు సంతోషంగా లేవని అన్నారు. కరోనాను కట్టడి చేసేందుకే తానునాన్నని, భక్తిభావంతో కొలిస్తేనే కాపాడుతానని తెలిపారు. గడపగడప నుంచి తనకు నైవేద్యాలు సమర్పించాలని చెప్పారు. భక్తి భావనతో ఐదు వారాలు శాక పోసి, యజ్ఞాలు చేయండని ఆజ్ఞాపించారు.

Tags

Next Story