అనుమానాస్పద స్థితిలో బీజేపీ ఎమ్మెల్యే మృతి!

బీజేపీ ఎమ్మెల్యే దేబేంద్రనాథ్ రాయ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. పశ్చిమ బెంగాల్‌లోని తన సొంతూరుకు కిలోమీటర్ దూరంలో ఉన్న బిందాల్ వద్ద ఎమ్మెల్యే మృతదేహం కనిపించింది.
ఆదివారం రాత్రి కొందరు వచ్చి ఎమ్మెల్యేను బైక్ పై తీసుకువెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. తెల్లారేసరికి బిందాల్ ఏరియాలో మూసివేసిన దుకాణం వరండాలో ఎమ్మెల్యే వేలాడు తుండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ మృతిపై కుటుంబ సభ్యులు.. ఆయన మద్దతుదారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయనది రాజకీయ హత్యే అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
దేబేంద్రనాథ్ రాయ్ హెమ్తాబాద్ నియోజకవర్గం నుంచి బెంగాల్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేబేంద్ర నాథ్ సీపీఐ-ఎం పార్టీని వీడి 2019, మే నెలలో బీజేపీలో చేరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com