యూజీసీ సూచనల మేరకు పరీక్షలు నిర్వహించాల్సిందే: కేంద్రం

సరైన సమయం చూసి డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం.. రాష్ట్రాలకు తెలపింది. యూజీసీ సూచనలకు అనుగుణంగా కేంద్రం ఈ మేరకు వ్యాఖ్యానించింది. సెప్టెంబర్ నెలాఖరులో పరీక్షలు నిర్వహించేలా.. రాష్ట్రాలు క్యాలెండర్ రూపొందించాలని కేంద్రం స్పష్టం చేసింది. పూర్తిగా పరీక్షలు రద్దు చేయాలనడం సరికాదని మానవనరుల శాఖ అధికారులు అన్నారు. విద్యార్థి సామర్థ్యం, నైపుణ్యాల స్థాయిని అంచనా వేయడానికి పరీక్షల ఫలితాలు ఉపయోగపడతాయని అన్నారు. పీజీ, డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలనే యూజీసీ నిర్ణయాన్ని కేజ్రీవాల్, మమతా బెనర్జీలు వ్యతిరేకించారు. ఇలాంటి సమయంలో కేంద్రం చేసిన వ్యాఖ్యలు సర్వాత్రా ఆసక్తి కలిగిస్తుంది.

Tags

Next Story