కాలిఫోర్నియాలో అగ్నిప్రమాదం.. 21 మందికి గాయాలు

కాలిఫోర్నియాలోని యునైటెడ్‌ స్టేట్స్‌ నావీ షిప్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 21 మంది గాయపడ్డారు. శాన్‌డియాగో ఓడరేవులో రెండు యూఎస్‌ నౌకలో ఒక్కసారిగా.. దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఘటన సమయంలో సుమారు 160 మంది నావికులు పోర్టులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Tags

Next Story