13 July 2020 2:19 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / నేపాల్‌లో వ‌ర‌ద...

నేపాల్‌లో వ‌ర‌ద బీభత్సం.. 60 మంది మృతి

నేపాల్‌లో వ‌ర‌ద బీభత్సం.. 60 మంది మృతి
X

నేపాల్‌లో వ‌ర‌ద‌లు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో గ‌త కొన్ని రోజులుగా ఎడ‌తెర‌పిలేని వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప‌లు ప్రాంతాల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ప‌లుచోట్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి.

వ‌ర‌ద‌లు, కొండ‌చ‌రియ‌ల కార‌ణంగా గ‌త నాలుగు రోజులుగా నేపాల్‌లోని ప‌లు ప్రాంతాల్లో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 41 మంది గ‌ల్లంత‌య్యారు. మొత్తం 60 మ‌ర‌ణాల్లో 27 మంది మ్యాగ్డీ జిల్లాకు చెందినవారే ఉన్నారు. కాగా, వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Next Story