అంతర్జాతీయం

మానవ తప్పిదం వలనే ఆ విమాన ప్రమాదం జరిగింది: ఇరాన్

మానవ తప్పిదం వలనే ఆ విమాన ప్రమాదం జరిగింది: ఇరాన్
X

ఈ ఏడాది ఆరంభంలో ఇరాన్ లో ఘోరవిమాన ప్రమాదం జరిగిన సంగతి తెలసిందే. ఈ ప్రమాదంలో 176 మంది మరణిచారు. మనవ తప్పిదం వలనే ఈ ప్రమాదం జరిగిందని ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. మానవ తప్పిదం వలన వాయు రక్షణ విభాగం రాడార్ సిస్టమ్ విఫలమైందని.. దీంతో వ్యవస్థలో 107 డిగ్రీల లోపం ఏర్పడిందని ఇరన్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ తెలిపింది. ఈ పొరపాటు వలన ఆ విమానం వరుస ప్రమాదాలకు గురైందని.. చివరిగా కుప్పకూలి 176 మందిని బలిగొందని తెలిపింది.

అయితే, ఈ విమాన ప్రమాదానికి ముందు.. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రక్తత పరిస్థితులు తలెత్తడంతో.. పలు అనుమానాలు తలెత్తాయి. ట్రెహ్రాన్ లోని ఇమామ్ ఖొమేని విమానశ్రయం నుంచి టేకాఫ్ అయిన తరువాత కొద్దిసేపటికే కుప్పకూలింది. 167 మంది ప్రయాణికులతో పాటు.. 9 మంది విమాన సిబ్బంది ఈ ప్రమాదంలో మరణించారు. అయితే, ఆ విమానాన్ని తమ రెండు ‘టార్‌ ఎం1’ క్షిపణులు కూల్చేశాయని ఇరాన్‌ అప్పట్లోనే ప్రకటించింది.

తాజాగా దీనిపై మాట్లాడిన ఓ ఉన్నతాధికారి.. ‘ఈ ప్రమాదం జరిగిన రోజున ఇరాన్,‌ అమెరికా దళాలపై దాడులు జరిపింది. దానికి ప్రతీకారంగా అమెరికా మా దళాలపై దాడులు చేస్తుందనే హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో డిఫెన్స్‌ యూనిట్‌ ఆపరేటర్‌ ఆకాశంలో ఎయిర్ ‌క్రాఫ్ట్‌ను గుర్తించాడు. దాంతో ఎలాంటి సమాచారం లేకుండానే రెండు రాడార్లను ఎయిర్‌క్రాఫ్ట్‌ మీదకు ప్రయోగించాడు. ఫలితంగా ప్రమాదం

సంభవించింది’ అన్నాడు.

Next Story

RELATED STORIES