అంతర్జాతీయం

నెల్సన్‌ మండేలా చిన్న కుమార్తె మృతి

నెల్సన్‌ మండేలా చిన్న కుమార్తె మృతి
X

దక్షిణాఫ్రికా తొలి నల్లజాతి అధ్యక్షుడు నెల్సన్ మండేలా చిన్న కుమార్తె జిండ్జీ మండేలా 59 సంవత్సరాల వయస్సులో మరణించినట్లు స్థానిక మీడియా సోమవారం తెలిపింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమావారం ఉదయం జోహన్నెస్‌బర్గ్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు పేర్కొంది. ఆమె ప్రస్తుతం డెన్మార్క్ రాయబారిగా ఉన్నారు. ఆమె మరణానికి కారణం వెంటనే వెల్లడించలేదు.

కాగా నెల్సన్‌ మండేలా- రెండో భార్య విన్నీ మడికిజెలాకు పుట్టిన సంతానం జిండ్జీ. 1992లో విడాకులు తీసుకోగా విన్నీ మడికిజెలా 2018 ఏప్రిల్‌ నెలలో మృతి చెందారు. ఆ తరువాత మండేలా ముచ్చట మూడో వివాహం చేసుకున్నారు. నెల్సన్‌ మండేలాకు మొత్తం ముగ్గురు భార్యలు ఆరుగురు సంతానం. 20 మంది మనువలు, మనవరాళ్లు ఉన్నారు. కాగా పాలక ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతినిధి పులే మాబే ఆమె మరణాన్ని "అకాల" గా అభివర్ణించారు.

Next Story

RELATED STORIES