ఆకాశంలో 20 రోజుల పాటు అద్భుతం

ఆకాశంలో 20 రోజుల పాటు అద్భుతం

ఆకాశంలో 20 రోజుల అద్భుత ఘటన చోటుచేసుకోనుంది. ఆకాశంలో ఓ తోకచుక్క 20 రోజుల పాటు కనువిందు చేయనుంది. సాయంత్రం సమయంలో ప్రతిరోజు 20 నిమిషాల పాటు భారతీయులకు కనిపించనుంది. ఆ తోకచుక్క పేరు నియోవైజ్‌. దీనిని శాస్త్రవేత్తలు ఇటీవలే కనుగొన్నారు.

కిలోమీటర్ల పొడవు ఉండే ఈ తోకచుక్క తన కక్ష్యలో తిరుగుతూ భూమికి అతి సమీపంగా వస్తుంది. ఈ క్రమంలో భారత్‌లో వాయువ్యం దిశలో మంగళవారం నుంచి కనిపించనుంది. ఈ తోకచుక్క చూడటానికి ఎలాంటి పరికరాలు అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story